సీఎం సొంతూరుకు వెళ్లే దారి ఇలా..

నవతెలంగాణ – ఉప్పునుంతల
సార్ నమస్కారం …ఉప్పునుంతల మండలం కంసానిపల్లి గ్రామంలో రోడ్డు దుస్థితి సార్. వంగూర్ నుండి ఉప్పునుంతల వరకు వేసిన డబల్ రోడ్డు వాహనదారులకు ఎంతో సౌలభ్యంగా ఉంది. ఈ మార్గం గుండా హైదరాబాదు, కల్వకుర్తి కి ప్రతిరోజు వందలాది వాహనాలు తిరుగుతున్నాయి. కంసానిపల్లి గ్రామంలోని అంతర్గత రోడ్డు అద్వానంగా తయారయింది. గుంతలు పడి వర్షం నీరు చేరడంతో కొద్ది దూరం ఆ మార్గం గుండా వెళ్లాలంటే వాహనదారులు జంకుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామ సమీపంలో ఇలాంటి రోడ్డు దుస్థితి ఉండడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. దయచేసి కనీసం తాత్కాలిక పనులైన చేస్తే బాగుంటుందని గ్రామ ప్రజలు అటువైపు వెళ్లే వాహనదారులు కోరుతున్నారు.