నవతెలంగాణ ముంబై: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ అక్టోబరు 3 నుంచి 20 వరకు యూఏఈ వేదికగా జరగనుంది. ఈ మెగా టోర్నీ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా, ఓపెనర్ స్మృతి మంధానను వైస్ కెప్టెన్‌గా కొనసాగించారు. వికెట్‌కీపర్ యాస్తికా భాటియా, ఆల్‌రౌండర్ శ్రేయంకా పాటిల్‌ను ఫిట్‌నెస్ సాధిస్తే జట్టుతోపాటు యూఏఈకి వెళ్తారు. ఉమా ఛెత్రి, తనుజా కన్వర్, సైమా ఠాకూర్‌ను ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపిక చేశారు.
టీ20 వరల్డ్‌కప్‌కు ఎన్నికైన ప్లేయర్లలో స్మృతి మందాన, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, యస్తికా భాటియా, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ థాకూర్, దయాలన్ హేమలత, ఆషా శోభనా, రాధా యాదవ్, శ్రేయాంక్ పాటిల్, సజనా సజీవన్ ఉన్నారు.