
– ఇల్లు కూల్చివేత…
– విడిసి పేరుతో ట్రాక్టర్ తో నివాసము గృహం నేలమట్టం ..
– మహిళలు, చిన్నపిల్లలకు గాయాలు…
– పరామర్శించిన సంచార ఓడ్ కుల జిల్లా కమిటీ
నవతెలంగాణ-డిచ్ పల్లి : ఇందల్ వాయి మండలంలోని నల్లవెల్లి గ్రామంలో వి డి సి పేరుతో కొందరు సంచార ఓడ్ కులానికి చెందిన కుటుంబంపై దాడి చేసి ట్రాక్టర్ తో ఇల్లు కూల్చివేసి భయభ్రాంతులకు గురి చేసిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది .గ్రామానికి చెందిన సాంబారి మురళి సొంత స్థలానికి దారి కావాలని కొంతమంది వీడీసీ సభ్యులైన పూదరి మనోహర్, తాళ్ల సాయిలు, ఆగ్గు జలంధర్, బండారి దామోదర్ తదితరులతో కలిసి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా బ్లేడ్ ట్రాక్టర్ తో ఇంట్లో రెండు సంవత్సరాల బాలుడికి పాలు తాపుతుండగా అది చూడకుండా రేకుల నివాస గృహాన్ని కూల్చివేశారు. తమ ఇంటిని ఎందుకు కూల్చుతున్నారని అడ్డువచ్చిన చవాన్ లక్ష్మిపై గొంతు నులిమి దాడి చేయగా బట్టలు చినిగిపోవడంతో పాటు తాళిబొట్టు తెగిపోయి స్పృహ కోల్పోయింది. పూటకు దిక్కులేని బతకడానికి వచ్చిన వారితో మాటలేంది… గాడుదుల లంజాలు, లంజా కొడుకులు చంపేసిన అడిగే దిక్కు ఉండదు.. అంటూ బెదిరింపులకు పాల్పడ్డారని బాధితురాలు చవాన్ లక్ష్మి వాపోయారు. ఈ విషయం తెలుసుకుని పరామర్శించేందుకు గురువారం నల్లవెల్లి గ్రామానికి వచ్చిన ఓడ్ కుల జిల్లా కమిటీ సభ్యులతో బాదితులు జరిగిన దాడి, తదితర విషయాలు వివరించాగ వారు అన్ని విషయాలు అడిగి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు చర్యలు తీసుకొని సంచార కుటుంబానికి రక్షణ కల్పించాలని ఓడ్ కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాదవ్ శరత్ డిమాండ్ చేశారు. సంఘటన సమాచారం తెలుసుకొని జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి జాదవ్ రాజు, ఉపాధ్యక్షులు జాదవ్ నారాయణ, కార్యదర్శి సాలూంకే సుధీర్, సంబాజీ, లక్ష్మణ్, మాదు, రామ్ దాస్ తదితరులతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో గత 35 సంవత్సరాల నుండి కూలి పనులు చేసుకుని జీవిస్తున్న సంచార కుటుంబంపై వీడిసి పేరుతో కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం లాలూచీ పడి మద్యం సేవించి బ్లేడ్ ట్రాక్టర్ తో నివాసం ఉంటున్న ఇంటిని కూల్చడమే గాక మహిళపై ఇష్ట రాజ్యంగా దాడి చేసి అవమానించడమే కాక రెండేళ్ల బాలుడికి సైతం గాయమయ్యేలా దౌర్జన్యంగా ప్రవర్తించిన కొందరు వీడీసీ సభ్యులు, సహకరించిన వారిపై వెంటనే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసు శాఖ వేంటనే స్పందించి ఈ ఘటనకు పాల్పడిన వారిని అరెస్టు చేసి ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలని ,లేనియెడల ఓడ్ కుల సంఘం ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్, కలెక్టర్, మానవ హక్కుల కమిషన్, జాతీయ సంచార జాతుల సంఘంలకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.