నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని చిన్నాపురం గ్రామంలో సీపీఐ(ఎం) గ్రామ మహాసభను గోవుల గంగాధర్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా జెండా ఆవిష్కరణ చేసి అఖిల భారత కార్యదర్శి సీతారాం ఏచూరి కి ఆర్మూర్ మండల్ చేపూర్ శాఖ కార్యదర్శి శకలి నర్సయ్య కు జోహార్లు అర్పించిన తర్వాత మహాసభను ప్రారంభించారు. ఆర్మూర్ ఏరియా కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ సీపీఐ(ఎం) పార్టీ మహాసభలు గ్రామ స్థాయి నుండి ఆల్ ఇండియా మహాసభలు 2025 ఏప్రిల్ లో జరుగుతున్నాయని వాటికి ముందుగా శాఖలు డివిజన్, జిల్లా, రాష్ట్ర మహాసభలు జరుపుకోవాలని అందులో బాగానే ఈరోజు మాక్లూర్ మండలం చిన్నాపూర్ గ్రామంలో శాఖ మహాసభ నిర్వహించడం జరిగిందన్నారు. సీపీఐ(ఎం) జిల్లా మహాసభలు ఈనెల 26, 27 తేదీలలో నిజామాబాద్ పట్టణంలో జరుగుతాయని అన్నారు. ఈనెల 18న ఆర్మూర్ ఏరియా మహాసభ జరుగుతుందని ఈ మహా సభకు కేంద్రం నుండి పాలడుగు భాస్కర్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు , పెద్ది వెంకట్ రాములు హాజరవుతారని ఈ మహాసభలను జయప్రదం చేయాల్సిందిగా కోరారు. చిన్నపూర్ గ్రామ శాఖ కార్యదర్శి గా గోగుల గంగాధర్ ను నూతనంగా ఏకగ్రవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గొగుల ఎర్ర సాయిలు, మల్లమ్మ, రాధ, లావణ్య, తదితరులు పాల్గొన్నారు.