ఈ నెల 13 దూరవిద్య ప్రవేశాలకు గడువు 

– మండల కోఆర్డినేటర్ బుదారపు శ్రీనివాస్ 
నవతెలంగాణ- పెద్దవంగర: దూర‌విద్యా విధానంలో టెన్త్, ఇంట‌ర్ ప్ర‌వేశాలు అపరాధ రుసుంతో ఈ నెల 13 వరకు దరఖాస్తు చేసుకోవాలని దూరవిద్య మండల కోఆర్డినేటర్ బుదారపు శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దూరవిద్యలో పది, ఇంటర్‌ పరీక్షలు రాసిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానున్నాయని, నేటి నుండి మండల కేంద్రంలోని దూరవిద్య అధ్యయన కేంద్రం, జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.