ఈ సక్సెస్‌ రామోజీరావుకి అంకితం

This success is dedicated to Ramoji Raoసోనియా సింగ్‌, పవన్‌ సిద్దు లీడ్‌ రోల్స్‌లో వినోద్‌ గాలి దర్శకత్వంలో రూపొందిన వెబ్‌ సిరీస్‌ ‘శశి మధనం’. హరీష్‌ కోహిర్కర్‌ నిర్మించారు. ఇటీవలే ఈటీవీ విన్‌లో రిలీజైన ఈ వెబ్‌ సిరీస్‌ ట్రెమండస్‌ రెస్పాన్స్‌తో సూపర్‌ హిట్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో హీరోయిన్‌ సోనియా సింగ్‌ మాట్లాడుతూ,’నా టీవీ కెరీర్‌ ఈటీవీతో మొదలైంది. మళ్ళీ ఈటీవీ విన్‌లో చేయడం చాలా ఆనందంగా ఉంది. మా సిరీస్‌ను ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన అందరికీ థ్యాంక్స్‌. ఆడియన్స్‌ సబ్‌ స్క్రిప్షన్‌ తీసుకుని మరీ చూడటం సంతోషంగా ఉంది. హరీష్‌ లేకపొతే ఈ ప్రాజెక్ట్‌ ఉండేది కాదు. అలాగే నితిన్‌, సాయి కూడా చాలా సపోర్ట్‌ చేశారు. వినోద్‌ అద్భుతమైన స్క్రిప్ట్‌తో వచ్చారు’ అని తెలిపారు. ‘ఈ సక్సెస్‌ చాలా ఆనందాన్ని ఇచ్చింది. డైరెక్టర్‌ వినోద్‌ అద్భుతంగా తీశారు. ఈటీవీ విన్‌కి కృతజ్ఞతలు. మా నుంచి వచ్చే ప్రతి ప్రాజెక్ట్‌కి మీ సపోర్ట్‌ కావాలి’ అని హీరో పవన్‌ సిద్దు చెప్పారు. డైరెక్టర్‌ వినోద్‌ గాలి మాట్లాడుతూ,’మా డైరెక్షన్‌ డిపార్ట్మెంట్‌ అంతా చాలా హార్డ్‌ వర్క్‌ చేశారు. మా నిర్మాత హరీష్‌కి థ్యాంక్స్‌. మొదటి నుంచి బలంగా నమ్మారు. మ్యూజిక్‌, డీవోపీ, ప్రొడక్షన్‌ డిజైనర్‌ ఇలా అందరూ అద్భుతంగా పని చేశారు. నటీనటులంతా చాలా సపోర్ట్‌ చేశారు. సిద్దు సోనియా చాలా కోపరేట్‌ చేశారు. ఈ సక్సెస్‌ని రామోజీ రావుకి అంకితం ఇస్తున్నాం’ అని తెలిపారు. ఈటీవీ విన్‌ కంటెంట్‌ హెడ్‌ నితిన్‌ మాట్లాడుతూ,’ఈ సక్సెస్‌ చాలా ఆనందాన్ని ఇచ్చింది. గత నెలలో రామోజీరావు స్వర్గస్తులైనప్పుడు, మేము అంతా దిగులుగా ఉన్న తరుణంలో మాకొచ్చిన సక్సెస్‌ ఇది. ఇదొక మంచి ఎంగేజింగ్‌ కంటెంట్‌ అని నమ్మాం. మా నమ్మకం నిజమైంది. సబ్‌ స్క్రిప్ప్షన్స్‌ వస్తున్నాయి. మేము పెట్టిన ఇన్వెస్ట్మెంట్‌ తొలి నెలలోనే రికవరీ అయ్యింది. సీజన్‌ 2 వర్క్‌ కూడా స్టార్ట్‌ అయ్యింది’ అని అన్నారు. నిర్మాత హరీష్‌ కోహిర్కర్‌ మాట్లాడుతూ,’ఫ్యామిలీ అంతా కూర్చుని చూసే ఎంటర్‌టైనర్‌ ఇది. ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ విన్‌కి థ్యాంక్స్‌’ అని చెప్పారు.