బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ ‘సింహ, లెజెండ్, అఖండ’ సినిమాలతో హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్స్ అందుకున్నారు. తాజాగా ఈ కాంబో 4వసారి కలిసి పని చేయనున్నారు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. దీనికి సీక్వెల్‌గా ‘అఖండ 2’ని తెరకెక్కించబోతున్నారు. ఎం. తేజస్విని నందమూరి సమర్పకురాలిగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా పలువురు అతిథుల సమక్షంలో బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తం షాట్‌కు తేజస్విని కెమెరా స్విచాన్ చేయగా, బ్రాహ్మణి క్లాప్ కొట్టారు. ముహూర్తం షాట్‌కు బాలకృష్ణ పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పారు. ‘అఖండ’లో హీరోయిన్‌గా నటించిన ప్రగ్యా జైస్వాల్ ఈ సీక్వెల్‌లో పార్ట్ అయ్యారు. కథలో ఆధ్యాత్మిక అంశాలను తెలిపే ‘అఖండ 2’ టైటిల్ థీమ్‌ను నందమూరి రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట, డీవోపీ: సి రాంప్రసాద్, సంతోష్ డి డెటాకే, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కోటి పరుచూరి, ఆర్ట్: ఏఎస్ ప్రకాష్, ఎడిటర్: తమ్మిరాజు.