‘సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సిసిఎల్) ఆడుతూ పెరిగాను. సిసిఎల్‌ది 14 ఏళ్ళ జర్నీ.ఇప్పటివరకు 4 సార్లు కప్పు గెలిచాం. ఈసారి కూడా కప్పు మనదే అనే నమ్మకంతో ఉన్నాం’ అని హీరో అఖిల్ అన్నారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సిసిఎల్) విజయవంతంగా 10 సీజన్లను పూర్తి చేసుకుంది. ఈనెల 8న బెంగళూరులో ఈ సీజన్‌ను ప్రారంభం కానుంది. ఈ సీజన్స్‌లో నాలుగుసార్లు ఛాంపియన్‌లుగా నిలిచి, 5వ టైటిల్ గెలుపు కోసం సిద్ధమవుతున్న తెలుగు వారియర్స్ పై అందరి దష్టి ఉంది. ఈ సందర్భంగా తెలుగు వారియర్స్ జెర్సీ లాంచ్ ప్రెస్ మీట్ నిర్వహించింది.
తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని మాట్లాడుతూ, ‘గ్లింప్స్‌లో చూస్తే ఓ చోట మరీ చిన్నపిల్లాడిలా కనిపించాను. సిసిఎల్ ఆడుతూ పెరిగాను. విష్ణు, సచిన్ ప్యాషన్‌తో ఇది సాధ్యపడిందని భావిస్తున్నాను. మేము నాలుగు సార్లు టైటిల్ గెలిచాం. ఈసారి కూడా టైటిల్ కొట్టి ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలుస్తామనే నమ్మకం ఉంది. అన్నింటికంటే అందరినీ ఎంటర్‌టైన్ చేయాలనే ప్యాషన్‌తో వస్తున్నాం. ఈనెల 14, 15 ఉప్పల్ స్టేడియంలో ఆడుతున్నాం. అందరూ వచ్చి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం’ అని అన్నారు
‘క్రికెటర్ కావాలనేది నా చిన్నప్పటి డ్రీం. సిసిఎల్ ఫార్మెట్ నా డ్రీంని తీర్చింది. దేశంలోని ప్రముఖ మైదానాల్లో క్రికెట్ ఆడటం ఓ అదష్టం. అఖిల్ అగ్రెసివ్ కెప్టెన్. తన ఎత్తుగడలు అద్భుతంగా ఉంటాయి. మూడు నెలలుగా చాలా ప్రాక్టీస్ చేశాం. ఈసారి తప్పకుండా కప్ కొడతాం. విష్ణు చాలా ప్యాషన్‌తో సీజన్స్‌ని ముందుకు తీసుకుతీసుకెళ్తున్నారు’ అని ఎస్‌ఎస్ తమన్ చెప్పారు.
సచిన్ జోషి మాట్లాడుతూ,’ఇండియాలో అందరి డ్రీమ్ క్రికెట్. ఆ డ్రీమ్ మాకు సిసిఎల్ రూపంలో తీరింది. ఈ క్రెడిట్ విష్ణుకి ఇస్తాను. తన ఆలోచన గొప్ప విజయం సాధించింది’ అని అన్నారు. హీరో ఆది మాట్లాడుతూ,’తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ మాకు విరాట్ కోహ్లి లాంటి ప్లేయర్. చాలా ప్యాషన్‌తో ఆడుతున్నాం. నాలుగు సార్లు కప్ కొట్టాం. ఈసారి మళ్ళీ ఛాంపియన్ అవుతాం’ అని తెలిపారు.