భిన్న కథతో ఈసారైనా..?!

భిన్న కథతో ఈసారైనా..?!విప్లవ్‌ దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘ఈసారైనా..?!’. ఈ సినిమాలోని మొదటి పాట ఇటీవల విడుదలైంది. యూట్యూబ్‌తోపాటు అన్ని మ్యూజిక్‌ ప్లాట్‌ఫార్మ్స్‌లో సంగీత ప్రియులను విశేషంగా అలరిస్తోంది. అద్భుతంగా రాసిన రాకేందు మౌళి సాహిత్యం, వినసొంపైన అర్జున్‌ విజరు గానంతో ఈ ట్రాక్‌ యువత నోట ప్రతిధ్వనిస్తోంది. పాటలోని ఎమోషన్‌ని పండించేలా సంగీత దర్శకుడు తేజ్‌ అద్భుతమైన సంగీతం అందించారు. అందమైన గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. ఓ నిరుద్యోగ యువకుడు ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతూ, అదేవిధంగా అతని ప్రేమను వెతుక్కునే దిశగా ఈ సినిమా సాగుతుంది. అశ్విని అయలూరు ప్రధాన నటిగా నటించిన ఈ చిత్రం ఈ జనరేషన్‌కి తగినట్టుగా అన్ని ఎమోషన్స్‌ను అందించే ఒక ప్రామిసింగ్‌ సినిమా అని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: సంకీర్త్‌ కొండా, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: విప్లవ్‌, డి ఓ పి: గిరి, ఎడిటింగ్‌: విప్లవ్‌, కళ: దండు సందీప్‌ కుమార్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: అభినరు కొండ, లైన్‌ ప్రొడ్యూసర్‌: పూర్ణిమ రెడ్డి.