
డిసెంబర్ 16 న జడ్పిహెచ్ఎస్ బాయ్స్ ఆర్మూర్ క్రీడా మైదానంలో జరిగిన ఉమ్మడి నిజామాబాద్ సీనియర్ జిల్లా జట్టు ఎంపిక పోటీలలో జడ్పిహెచ్ఎస్ తొర్లికొండ క్రీడాకారులు బానోత్ రాజు మరియు చలిగంటి సుశాంత్ లు పాల్గొని చక్కని ప్రతిభ కనబరిచి ఈనెల 8 నుండి 9 వరకు వాగ్దేవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, బొల్లంకుంట, హనుమకొండ జిల్లాలో జరిగే 11వ రాష్ట్ర సీనియర్ సాఫ్ట్ బాల్ పోటీలలో పాల్గొంటున్నట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మర్కంటి గంగా మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోటీలకు ఎంపికైన క్రీడాకారులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాధికారి ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.