– ఇబ్బందిపడుతున్న వాహనదారులు
– పట్టించుకోని ఆర్& బి అధికారులు
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పెద్ద గుల్లా రోడు విస్తరణ అర్థ్రాంతరంగా చిన్న గుల్లా ఇవతలి వరకు పూర్తీ చేసినారు. ముందు రోడు అలాగే సగం వరకు వదిలేశి నాలుగేండ్లు అవుతోంది. ఇప్పటి బీఆర్ఎస్ ప్రభూత్వ వైఫల్యం వలనే గుత్తేదారులకు బిల్లులు చెల్లించక పోవడంతో పనులు నిలిపివేశారు. ప్రస్తుతం రోడు దయనీయస్థితిలో ఉందిి. రొడుకు ఇరువైపుల ఎపుగా ముళ్ల కంపలు పెర్గి పోయి వాహన దారులకు వెళ్ల లేని దుస్థితి నెలకొంది. రోడు పైన వేసిన సన్నం కంకర వలన ద్విచక్ర వాహనాల దారులకు బండ్లు జారీ పడటం, టైర్లు దిగిపోవడం తో ఇబ్బందిగా మారిందని వాహనదారులు తెలిపారు. ఇప్పడికైన కాంగ్రేస్ హయమలో నైన రోడు పనులు గుల్లాతాండా మహరాష్ట్ర సరిహద్దు వరకు పూర్తీ చేయాలని, ఇరువైపుల పెర్గిన ముళ్ల పొదలను తొలగించాలని వాహనదారులు పేర్కోన్నారు.