ఆ.. 3 పాయింట్లు చాలా కీలకం

Those 3 points are very important”క’ మూవీ క్లైమాక్స్‌ను కొత్తగా చెప్పడానికి ప్రయత్నించాం. ఇలాంటి క్లైమాక్స్‌తో ఇంత వరకు ఏ సినిమా రాలేదు. అందుకే కొత్తదనం మీరు ఫీల్‌ కాకపోతే నేను సినిమాలు చేయను అనే బోల్డ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చాను’ అని హీరో కిరణ్‌ అబ్బవరం అన్నారు. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ పై చింతా గోపాలకష్ణ రెడ్డి నిర్మించిన  చిత్రం ‘క’. దర్శక ద్వయం సుజీత్‌, సందీప్‌ రూపొందించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా ఈ నెల 31న తెలుగులో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను తెలుగులో  ప్రొడ్యూసర్‌ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్‌ సల్మాన్‌ తన వేఫర్‌ ఫిలింస్‌ పై రిలీజ్‌ చేయబోతున్నారు. సినిమా విడుదల సందర్భంగా హీరో కిరణ్‌ అబ్బవరం  మీడియాలో సంభాషించారు. ‘క’ అంటే ఏంటి?, ఈ మూవీ కథ ఏంటి అనేది మీకు క్లైమాక్స్‌లో రివీల్‌ అవుతుంది. దర్శకులు సందీప్‌, సుజీత్‌ ఈ కథ చెప్పినప్పుడు నెక్ట్స్‌ ఏం  జరుగుతుంది అనేది ఊహించలేకపోయాను. అలాగే దర్శకులు చెప్పిన షాట్‌ మేకింగ్‌ కూడా కొత్తగా అనిపించింది. చాలా మంది ‘కాంతార, విరూపాక్ష’ సినిమాలతో  పోలుస్తున్నారు. కానీ అలా ఏమాత్రం ఉండదు. ఇది సైకలాజికల్‌గా వెళ్ళే సినిమా. ఇందులో ఎలాంటి డివోషనల్‌ పాయింట్స్‌ ఉండవు. ఎవరు?, ఏంటి?, ఎక్కడ అనే సస్పెన్స్‌తో  మూవీ సాగుతుంది. ప్రతీసారి ఈ మూడు పాయింట్స్‌ ప్రేక్షకుల్ని ట్రిగ్గర్‌ చేస్తుంటాయి. 1977లో కష్ణగిరి అనే ఊరిలో ఉండే అభినయ వాసుదేవ్‌ అనే పోస్ట్‌ మ్యాన్‌ క్యారెక్టర్‌లో  నటించాను.ఈ పాత్ర కోసం చాలా హోం వర్క్‌ చేశాను. రాధ పాత్రలో తన్వీరామ్‌ చేసింది. ఈ పాత్ర ద్వారా మా క్యారెక్టర్స్‌ రివీల్‌ అవుతుంటాయి. సత్యభామ క్యారెక్టర్‌లో నయన్‌  సారిక కనిపిస్తుంది. తను అభినయ వాసుదేవ్‌ లవ్‌ ఇంట్రెస్ట్‌గా నటించింది. వీరిద్దరివీ కీలక పాత్రలే. నాగ చైతన్య మా మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు గెస్ట్‌గా వస్తున్నారు. నా  ఫిల్మోగ్రఫీలో ఒక మంచి మూవీగా ఇది నిలుస్తుంది.