విధుల్లో నుంచి తొలగించిన వారిని తక్షణమే తీసుకోవాలి

Those dismissed from duty should be taken immediately– సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ 

నవతెలంగాణ – కంఠేశ్వర్ 

నిజామాబాద్ నగరంలోని ఐటీ హబ్లో పనిచేస్తున్న కార్మికులను విధుల్లో నుంచి తొలగించిన వారిని తక్షణమే తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. ఐటిఏ హబ్ లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పై కార్మిక శాఖ అధికారి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ఐటి హబ్ లో పని చేయటానికి గత సంవత్సరం తేదీ 2/ 8/ 23 న కరీంనగర్ కు శ్రీ మిత్ర అసోసియేషన్ వల్ల హౌస్ కీపింగ్ కొరకు నియమించుకొన్న 15 మందిని విధుల్లో నుండి పని మాన్పించి 15 రోజులు అవుతుంది. విధులనుండి మాన్పించడంతో కార్మిక కుటుంబాలు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల వెంటనే విధుల్లోకి తీసుకొని ఉపాధి కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రెండు నెలల బకాయి వేతనాలు ఇప్పటివరకు చెల్లించలేదు. కార్మికులకు విధుల్లోకి తీసుకొని బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో అనసూయ, రేఖ, అనిత, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.