వాంకిడి మండలానికి చెందిన శైలజ మృతికి కారకులైన వారిని శిక్షించాలని పిడిఎస్యూ జిల్లా అధ్యక్షుడు సిడం సాయికుమార్ అన్నారు. మంగళవారం పట్టణంలోని పిడిఎస్యూ కార్యాలయంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆశ్రమ బాలికల పాఠశాలలో 9 తరగతి చుదువుతూ గత 15 రోజుల క్రితం ఆ పాఠశాలో పూడ్ పాయిజాన్ జరిగిందన్నారు. నిమ్స్ lo చికిత్స పొందుతూ మృతి చెందడం బాధకారమన్నరు. శైలజ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని వారి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఒకరికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆమె కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యూ ప్రధాన కార్యదర్శి కొమర అశోక్, నాయకులు సుంగు హరీష్ పాల్గొన్నారు.