ఆ మూడు పంచాయతీలకు ప్రత్యేక ఎంపీటీసీ స్థానాన్ని కల్పించాలి

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ ఉమ్మడి మండలంలోని డోంగ్లి నూతన మండలం గా ఏర్పడడం రాష్ట్ర ప్రభుత్వం డోంగ్లి మండలాన్ని ప్రత్యేక మండలం గా గుర్తిస్తూ ఎంపిటిసి స్థానాలను కేటాయించడం జరిగింది. ఈ మండలానికి ఐదు ఎంపిటిసి స్థానాలు కేటాయించగా గత ఉమ్మడి మండలంలో గల దోతి మారేపల్లి మల్లాపూర్ ఈ మూడు పంచాయతీలు సుల్తాన్ పేట్ ఎంపిటిసి స్థానంలో ఉండేవి సుల్తాన్ పెట్ గ్రామం మద్నూర్ మండలంలో ఉండడం ఎంపిటిసి స్థానాలు మారాయి దోతి మల్లాపూర్ మారేపల్లి ఈ మూడు గ్రామపంచాయతీలను డోంగ్లి మండలంలోని మోగా ఎంపిటిసి స్థానంలో కలపడం జరిగింది. ఈ మూడు పంచాయతీల పరిధిలో నాలుగు గ్రామాలు ఉన్నాయి ఓటర్ల సంఖ్య 3141 ఉన్నాయి మూడు పంచాయతీలు నాలుగు గ్రామాలను కలిపి ఒక ప్రత్యేక ఎంపీటీసీగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆ మూడు గ్రామ పంచాయతీల పరిధిలోని మాజీ సర్పంచులు పార్టీల ముఖ్య నాయకులు గురువారం నాడు కామారెడ్డి కలెక్టరేట్ తరలివెళ్లి జిల్లా కలెక్టర్కు జిల్లా పరిషత్ సీఈఓ కు వినతి పత్రాలు అందజేశారు. మోగా గ్రామం చాలా పెద్దదని ఈ మూడు పంచాయతీలు వాటిలో కలపడం 5 వేలకు పైగా ఓటర్లతో ఎంపీటీసీ స్థానం అతిపెద్దగా కావడమే కాకుండా దోతి మల్లాపూర్ మారేపల్లి గ్రామపంచాయతీలకు దూరప్రాంతంగా అవుతుందని ప్రభుత్వం ఆలోచించి మా మూడు గ్రామ పంచాయతీలను కలిపి ప్రత్యేక ఎంపీటీసీ స్థానాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్కు అందజేసిన వినతి పత్రంలో ఆయా గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేశారు.