– బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్
ముంబయి : భారత్, ఆస్ట్రేలియా ప్రతిష్టాత్మక బోర్డర గవాస్కర్ టెస్టు ట్రోఫీ సన్నాహకాలు మొదలయ్యాయి. నవంబర్ 22 నుంచి పెర్త్‌లో తొలి టెస్టు ఆరంభం కానుండగా.. భారత జట్టులో ఇదరు ఆటగాళ్లు కాస్త ముందుగానే ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. కెఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్‌లు ఈ నెల 7 నుంచి ఆరంభం కానున్న భారత్-ఏ, ఆసీస్-ఏ రెండో అనధికార టెస్టులో పోటీపడనున్నారు. తొలి టెస్టు ముంగిట పెర్త్‌లో భారత్, భారత్-ఏ వార్మప్ మ్యాచ్ షెడ్యూల్ చేసినా.. భారత కెప్టెన్ రోహిత్ శర్మ నెట్ ప్రాక్టీస్‌కే మొగ్గు చూపిన సంగతి తెలిసిందే. భారత జట్టు నవంబర్ 10న ఆస్ట్రేలియాకు బయల్దేరనుంది. పెర్త్ టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. వ్యక్తిగత కారణాలతో రోహిత్ శర్మ తొలి టెస్టుకు అందుబాటులో ఉండటం లేదని బోర్డు వర్గాలు తెలిపాయి.