– లియాండర్ పేస్, విజయ్ అమృత్‌రాజ్‌కు చోటు
న్యూపోర్ట్ (యుఎస్‌ఏ) : అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇద్దరు భారత దిగ్గజాలకు చోటు దక్కింది. యుఎస్‌ఏలోని న్యూపోర్ట్‌లోని ప్రపంచ టెన్నిస్ ‘ది హాల్ ఆఫ్ ఫేమ్’లో లియాండర్ పేస్, విజరు అమృత్‌రాజ్‌లు నిలిచారు. ఈ మేరకు హాల్ ఆఫ్ ఫేమ్‌లో తన ఫోటో వద్ద లియాండర్ పేస్ భావోద్వేగానికి లోనయ్యాడు. 1996 అట్లాంట ఒలింపిక్స్‌లో భారత్‌కు కాంస్య పతకం సాధించిన లియాండర్ పేస్.. గ్రాండ్‌స్లామ్ చరిత్రలోనూ తనదైన ముద్ర వేశాడు. ‘మా నాన్న 1972 ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించటంతో.. ఆ ఘనత పునరావృతం చేద్దామనే లక్ష్యంతోనే టెన్నిస్ రాకెట్ పట్టాను. అట్లాంట ఒలింపిక్స్‌లో పతకం సాధించిప్పుడు నా తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు. నా అభిమానులు, ప్రజలు నాకు గొప్ప మద్దతుగా నిలిచారు’ అని లియాండర్ పేస్ అన్నాడు.