
దళితులపై సామాజిక వివక్ష పాటించి సహకరించిన వారిని అరెస్టు చేయాలని కెవిపిఎస్ నాయకులు డిమాండు చేశారు. ఈ మేరకు ఆదివారం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నరసయ్య ఉపాధ్యక్షుడు కొండ గంగాధర్ మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లా జగదేవ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో దళితులకు చౌర షాపులో క్షవరం చేయకుండా సామాజిక కుల వివక్షకు ప్రోత్సహించిన నిందితులను అరెస్టు చేయాలని కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండగంగాధర్ డిమాండ్ చేశారు తిమ్మాపూర్ గ్రామంలో సామాజిక వివక్ష కొనసాగుతుంది షోరూం షాపులో దళితులకు క్షవరం చేయించకుండా గ్రామాల్లో ఆధిపత్య కులాలను తీర్మానం చేసి అవమాన పరుస్తున్నారు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు దళితులు చెరువు పండుగ పూరి గ్రామ ప్రజలతో కలిసి తినకూడదని అనడం విడ్డూరంగా ఉంది దళితులపై ఇంత వివక్ష పాటిస్తున్న నిందితులను ఇంతవరకు పోలీసులు వారి అరెస్టు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం నిందితులను వెంటనే అరెస్టు చేయాలని సంబంధిత అధికారులు ఎమ్మార్వో పోలీసులు గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి మనుషులంతా సమానమే అని సదస్సుల ద్వారా అవగాహన కల్పించాలని కులవ్యక్ష వ్యతిరేక పోరాట సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నల్గొండ నరసయ్య రాజేష్ నరసయ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు.