
– మాజీ సర్పంచ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బెజ్జూరి శ్రీనివాస్
నవతెలంగాణ -తాడ్వాయి
సామాజిక మాధ్యమాల్లో మంత్రి సీతక్క, మానుకోట రిజిస్టర్ తస్లీమా వారిపై సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ఆరోపణలు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని బీరెల్లి సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీనివాస్ అన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఎక్కడ ఏం జరిగిన, ఎవరు ఏం చేసినా సీతక్క గారిపై రుద్దడం పరిపాటి అయింది, కొందరు ప్రతిపక్ష నేతలకు, అలాంటి వారికి సిగ్గుండాలిని దుయ్యబట్టారు. రిజిస్ట్రార్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్న వెంకటేష్ దగ్గర డబ్బులు దొరకగానే కావాలని తస్లీమా గారిని అవినీతిపరురాలుగా చిత్రీకరించడం ఒక కుట్రపూరిత చర్య అని మండిపడ్డారు.ఈ మధ్య ఎదుగుతున్న, మంచి పేరును సంపాదించుకుంటున్న నాయకులపై, అధికారులపై కావాలని అవినీతి ఆరోపణలు చేయడం కొందరికి అలవాటు అయినది అని అన్నారు. గత ఇరవై యేండ్ల రాజకీయంలో ఎటువంటి మచ్చ లేని సీతక్క గారిపై కూడా నేడు కావాలని కొందరు ఆరోపణలు చేయడం నీచాతి నీచం అని ఆరోపించారు. నిజమైన సేవకులు సీతక్క, తస్లీమా గార్లు వారిపై కావాలని అసత్య ప్రచారం చేస్తున్న కొందరిని వెంటనే అరెస్టు చేసి చట్టరీత్య తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.