సంఘాలలో సభ్యులుగా లేని వారిని గుర్తించి సంఘాలు ఏర్పాటు చేసి లబ్ధి చేకుర్చలి…

– డిఅర్డిఓ, డిఅర్డిఎ పిడి చందర్ నాయక్..
నవతెలంగాణ- డిచ్ పల్లి
గ్రామాలలో నీరుపేద వారికి, సంఘాలలో సభ్యులుగా లేని వారిని గుర్తించి నూతనంగా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి వారికి లబ్ధి చేకుర్చే విధంగా డిఅర్డిఓ డిఅర్డిఎ పిడి చందర్ నాయక్ సూచించారు.ఇందూరు జిల్లా మహళ పరస్పర సహకార సమాఖ్య76 వ కార్యవర్గ సమావేశం బుధవారం డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘన్పూర్ లోని టిటిడిసి ట్రైజం సెంటర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా పిడి చందర్ నాయక్  మాట్లాడుతూ.. బ్యాంకు లింకేజీ స్ర్తీ నీది ద్వారా వచ్చే రూణలను ఉపయోగించుకొని మహిళలు వివిధ రకాలైన యానిట్లను ఏర్పాటు ద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలని పేర్కొన్నారు. చాలా తక్కువ ధృవీకరణ పత్రాలతో రూణ సదుపాయాలు పొందే అవకాశం స్వయం సహాయక సంఘ సభ్యులకు ఉంటుందని వివరించారు. నూతన సంఘాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు.నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేసి ” నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా సమాఖ్య కార్యవర్గ సభ్యులకు నూతన యూనిఫాంలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్, ప్రొజెక్ట్స్ ఎగ్జిక్యూటివ్ వెంకట్, డిపిఎం శ్రీనివాస్, డిపిఎం ఫైనాన్స్ సంధ్యారాణి, డిపిఎం బ్యాంక్ లింకేజీ నీలిమా,  పాయల్, స్త్రీ నిధి అర్ఎం రాందాస్, ఏపిఎం రవికుమార్, జిల్లా కార్వవర్గ సభ్యులు, జిల్లా సమాఖ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.