
సంక్రాంతి పండుగకి సొంత గ్రామాలకు వెళ్లే వాహనదారులు క్షేమంగా వెళ్లి సురక్షితంగా తమ గ్రామాలకు చేరుకోవాలని తుంగతుర్తి సర్కిల్ సీఐ శ్రీను నాయక్ అన్నారు.శుక్రవారం మండల కేంద్రంలోని సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పలు సూచనలు చేశారు.ఈ మేరకు వాహనదారులు బండి కండిషన్ చెక్ చేసుకుని,టూ వీలర్ పై ఇద్దరు కంటే ఎక్కువ వెళ్ళవద్దని,స్త్రీల చీరల కొంగులు పైటలు ద్విచక్ర వాహనాలలో పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, హెల్మెట్ ధరించాలని సూచించారు.కార్లలో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ ధరించాలని,ఉదయం పూట మంచు ఎక్కువగా ఉండటం వలన తక్కువ స్పీడ్ తో వెళ్లాలని సూచించారు.ఇంటికి తాళం వేసి పండుగలకు వెళ్లే సమయంలో విలువైన వస్తువులను ఇండ్లలో ఉంచరాదని,పక్కింటి వారికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. విధిగా ప్రజలు వీలైనంతవరకు తమ నివాసాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని దొంగతనాల నివారణకు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.