– బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు కావలి గోపాల్, మున్సిపల్ అధ్యక్షుడు వాసుదేవ్ కన్నా, చైర్‌పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్‌కుమార్
నవతెలంగాణ-శంకర్‌పల్లి
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యను విమర్శించేవారు వరిసెనులో ఒడిపిలితో సమానమని బీఆర్‌ఎస్ శంకర్‌పల్లి మండల అధ్యక్షులు కావలి గోపాల్, మున్సిపల్ అధ్యక్షుడు వాసుదేవ్ కన్నా, మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్‌కుమార్, జడ్పీటీసీ గోవిందమ్మగోపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మిర్జాగూడ సర్పంచ్ రవీందర్‌గౌడ్, గోపులారం సర్పంచ్ పొడవు శ్రీనివాస్ అన్నారు. గురువారం శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని మనీ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌లో అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా అందరం కలిసికట్టుగా మద్దతు ప్రకటిస్తామన్నారు. అవినీతి అక్రమాలు ఎమ్మెల్యే యాదయ్య చేయలేదని స్పష్టం చేశారు. అధిష్టానం యాదయ్యకు టికెట్ కేటాయించడం వల్ల మండలంలోని మెజార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు, కార్యకర్తలందరూ ముక్తకంఠంతో మద్దతు ప్రకటిస్తున్నారని తెలిపారు. టికెట్టు వచ్చిన తర్వాత చిల్లర మాటలు మాట్లాడకూడదని హితువుపలికారు. ఏదైనా విషయం ఉంటే అధిష్టానంతో మాట్లాడుకోవాలని సూచించారు. బీఆర్‌ఎస్‌లో ఉన్న నాయకులను, కార్యకర్తలను మభ్యపెట్టడం సరైన పద్ధతి కాదన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే యాదయ్యను గెలిపించుకుంటాని తెలిపారు. ఒక శంకర్పల్లి మండలానికి రూ. 13 కోట్లు సీఎం సహాయనిధి కింద తీసుకొచ్చిన ఘనత ఎమ్మెల్యే యాదయ్యకే దక్కిందన్నారు. పార్టీకి నష్టం కలిగించే పనులు గ్రూపు రాజకీయాలు ఎవరు కూడా పాల్పడవద్దని తెలిపారు. బీఆర్‌ఎస్‌లో కొంత స్తబ్దత ఉందని విషయం అందరికీ తెలుసుకుని, దాన్ని అధిగమించి కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే క్యాండెట్ దిక్కులేదని ఆరోపించారు. యాదయ్య గెలుపు నల్లేరు మీద నడికే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటివరకు ముఖ్యమంత్రి కాండిడేట్ డిక్లేర్ చేయకపోవడం ఒకవేళ డిక్లేర్ చేసిన గాంధీ భవన్‌లో అద్దాలు పగలడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి, సొసైట సొసైటీ చైర్మన్ శశిధర శశిధర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాపారావు, వైస్ చైర్మన్ కురుమ వెంకటేష్, సర్పంచులు నరసింహారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, అనిత సురేందర్ గౌడ్, ఎంపీటీసీ ప్రవళిక వెంకట్ రెడ్డి, పరివేద వెంకటరెడ్డి, కౌన్సిలర్లు చంద్రమౌళి, సంధ్యారాణి, అశోక్ కుమార్, తలారి నాగేందర్, మాజీ ఎంపీపీ నర్సింలు, బీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గౌడ చర్ల వెంకటేష్, గౌడ చల్ల నరసింహ, రామ్ రెడ్డి పొద్దుటూరు గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.