విప్ ధిక్కరించిన వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే

– నాగిరెడ్డి పేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్..
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట్ వైస్ ఎంపీపీ ఎన్నికలో  విప్ ధిక్కరించిన ఎంపిటిసి లకు తగిన మూల్యం చెల్లించక తప్పదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఇతర పార్టీలోకి వెళ్లి ఇతర పార్టీ నాయకులకు సపోర్ట్ చేసిన వారికి కాంగ్రెస్ పార్టీ తగిన బుద్ధి చెబుతుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ జారీ చేసిన విప్టు తిరస్కరించి ఇతర పార్టీ నాయకులకు సపోర్ట్ చేసిన వారు తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆయన అన్నారు. విప్ను ధిక్కరించి నిర్వహించిన ఎన్నిక చెల్లదని ఆయన అన్నారు. నాగిరెడ్డిపేట్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని ఆయన గుర్తు చేశారు. వారం రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీపీగా అవుతారని ఆయన అన్నారు. అన్న వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ విఠల్ రెడ్డి, దివిటి కిష్టయ్య, ఇమామ్ లక్ష్మణ్, పర్వత రావు,  నారాయణరెడ్డి, ఊర లావణ్య, ధర్మవీర్, నరసింహారెడ్డి, సాయ గౌడ్ శ్రీనివాస్ గౌడ్, తదితరులు ఉన్నారు.