రూణలు కావాల్సిన వారు ఏపిఎం లను సంప్రదించండి… 

– డిపిఎం సాయిలు..
నవతెలంగాణ డిచ్ పల్లి:
వ్యాపారం చేయాలను కునేవారు బ్యాంకుల్లో రూణలు కావాల్సిన వారు ఉంటే మండల కేంద్రంలో ఉండే ఏపిఎం లను సంప్రదించాలని, ఐకెపి డిపిఎం సాయిలు అన్నారు. శనివారం డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘన్పూర్ శివారులోని ఎస్బిఐ అర్ఎస్ఈటిఐ  ఆధ్వర్యంలో జనరల్ ఈ డి పి శిక్షణా ముగింపు కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐకెపి డిపిఎం సాయిలు పాల్గొని శిక్షణ పూర్తి చేసుకున్న శిక్షకులకు దృవీకరణ పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రస్తుతం మహిళా సంఘాల సభ్యులకు స్కూల్ డ్రెస్ లు కుట్టడానికి అవకాశం కల్పించడం జరిగిందని, కొందరు మహిళలు ఈ స్కూల్ డ్రెస్సులు కుట్టి లబ్ధి పొందుతున్నారని, ఇది మంచి అవకాశం అన్నారు. శిక్షణలో నేర్చుకున్న వాటిని సద్వినియోగం చేసుకొని సమయం ఉంటే మండల కేంద్రాల్లో ఉండే ఐకెపి కార్యాలయనికి వెళ్లి స్కూల్ డ్రెస్ లు కుట్టడం ద్వారా ఉపాధి పొందాలని సూచించారు. శిక్షణ తో కుటుంబాలను హాయిగా గడుపుకోవచ్చని నేర్చుకున్న పట్టుదలతోనే జీవితంలో స్థిర పడాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్బిఐ అర్ఎస్ఈటిఐ డైరెక్టర్ సుంకం శ్రీనివాస్, భాగ్యలక్ష్మి, రామకృష్ణ , కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.