– సిపిఐఎం ఆధ్వర్యంలో చౌరస్తాలు కురవత్తులతో ర్యాలీ మానవహారం
నవతెలంగాణ-గోవిందరావుపేట
కోల్కత్తా నగరంలో వైద్య విద్యార్థిని నీ అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని శుక్రవారం మండలంలోని పసర చౌరస్తాలో సిపిఐ ఎం పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించి మానవహారం గా ఏర్పడి దోషులను శిక్షించడమే కాకుండా చనిపోయిన వైద్య విద్యార్థిని ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు మాట్లాడుతూ దోషులను కఠినంగా శిక్షించాలని సమగ్ర విచారణ జరిపించాలని మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు దేశ చరిత్రలో పునరావృతం కాకుండా బలోపేతమైన చట్టాలను కఠినంగా అమలు పరచాలని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి అనుమానాస్పదంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పొదల చిట్టిబాబు జిల్లా కమిటీ సభ్యులు గొంది రాజేష్ మండల కమిటీ సభ్యులు సోమ మల్లారెడ్డి గ్రామ కార్యదర్శి కడారి నాగరాజు సూర్యనారాయణ యానాల పంజాల శ్రీనివాస్ ధర్మారెడ్డి మహిళా సంఘం నాయకురాలు మంచాల కవిత కందుల రాజేశ్వరి సువర్ణ స్వరూప సీత రాజేశ్వరి నాయకులు అశోక్ సమ్మక్క అంజద్ ఉదయ్ గణేష్ రామస్వామి డివైఎఫ్ఐ మండల కార్యదర్శి పిట్టల అరుణ్ జీవన్ అరవింద్ రవి నరసింహారావు శ్రీనివాస్ రవి ప్రభాకర్ హైమా నాగేశ్వరమ్మ లింగమ్మ కుమార్ కనక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.