ఆత్మీయతను పంచుకునేవి ఆత్మీయ సమ్మేళనాలు

– మేయర్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం
నవతెలంగాణ-బంజారాహిల్స్‌
ఆత్మీయతను పంచుకునేందుకు అందరి సమస్యలను తెలుసుకునేందుకు ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసినట్టు నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌ ప్రభాకర్‌ రావు అన్నారు. ఆదివారం బంజారా భవన్‌లో ఏర్పాటు చేసిన బంజారాహిల్స్‌ డివిజన్‌ ఆత్మీయ సమ్మేళ నంలో పాల్గొన్న వారు ప్రభుత్వ పథకాలను అనుభవిస్తూ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలన సుస్థిరంగా సంక్షేమంగా ఉందని కొనియడారు. అయినా కొందరు చిన్న చిన్న సమస్యలకు భూతద్దంలో చూస్తూ సొంత పార్టీలో అంతర్గత విభేదాలను సృష్టిస్తున్నారనీ, అలాంటి వారికి పార్టీలో స్థానం లేదన్నారు. రాత్రికి రాత్రే ఈ పదవులు ఈ హౌదా తమకు రాలేదనీ, సాధారణ కార్యకర్త జీవితాన్ని అనుభవించామనీ, ప్రస్తుతం ఇంత ప్రశాంతమైన వాతావరణంలో మీటింగ్లో ఏర్పాటు చేసుకుంటున్నాం అనీ, మనం తాము కార్యకర్తగా ఉన్నప్పుడు చేతి కర్చీపును కూర్చోవడానికి వేసుకుని ఆయిల్‌ నీళ్లతో కాలయాపన చేశామని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని ప్రభుత్వ కార్యాలయాలు నియోజకవర్గంలోనే ఉన్నాయన్నారు. దేశంలో మొట్టమొదటిసారి 2 వేల పడకల హాస్పిటల్‌ను మన నియోజకవర్గం, మన రాష్ట్రంలో వచ్చే నెల 14వ తేదీన ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్నారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందరూ తీసుకుని ఓటు వేరే పార్టీకి వేశారనీ, అలాంటి వారికి రెండో ప్రతిపా దనలో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని తెలిపారు. 58,59 సాంకేతిక సమస్యలునున్నాయనీ, అయినా దాన్ని తన దృష్టికి తీసుకువస్తే వెను వెంటనే పరిష్కరిస్తామనీ, ఈ విషయమై తాను ప్రభుత్వ అధికారులకు కలిసి ఇక్కడ నిరుపేదలు నివసించే బస్తీలు ఎక్కువగా ఉన్నాయని ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఆ విషయాన్ని తీసుకువె ళ్లాలనీ, మన నియోజకవర్గంలో 5 వేల రెండు పడకల గదులు పంపిణీ చేస్తామని తెలిపారు. హ్యాట్రిక్‌ విజయం సాధించి సీఎం బహుమతి ఇవ్వాలని కార్యకర్తలకు కోరారు. 500, 100 చొప్పున కుట్టు మిషన్‌ పంపిణీ చేస్తానని ఎమ్మెల్యే దానం చెప్పారు. ఈ కార్యక్రమంలో అర్బన్‌ డెవలప్మెంట్‌ చైర్మన్‌ విప్లవ కుమార్‌, బంజా రాహిల్స్‌ డివిజన్‌ మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.