
నవతెలంగాణ – చివ్వేంల
పార్టీలు మారే వారికీ కాకుండా పార్టీ కోసం కష్టపడ్డ తనకు నల్లగొండ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని గతం నుండి వివిధ అవకాశాల్లో బీఆర్ఎస్ పార్టీలో పదవులను అనుభవించిన వారికి కాకుండా, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ తనకు రానున్న పార్లమెంట్ ఎలక్షన్ లో నల్గొండ పార్లమెంట్ బీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు హెచ్ ఆర్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్ రెడ్డి కి ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. పార్టీ పదవులను అనుభవించి పార్టీ ఓటమికి కారుకులైన కొంతమంది కోవర్ట్ లకు కాకుండా పార్టీ కోసం పనిచేసే, పార్టీ గెలుపులో ముఖ్య పాత్ర పోషించిన యువకులకు అవకాశం కల్పించి, చట్టసభల్లో యువకుల గలం వినిపించే విధంగా పార్టీ అధినాయకత్వం అవకాశం కల్పించాలని పార్టీకి విజ్ఞప్తి చేశారు. పదవులు అనుభవించిన వారికే మళ్లీ పదవులు ఇస్తే పార్టీకి నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తవారికి అవకాశంఇస్తే రానున్న పార్లమెంట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు