పనిచేసే వాళ్లకు పట్టం కట్టాలి

– ఎన్నికల ప్రచారంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
నవతెలంగాణ – రాయపోల్‌
మాయ మాటలు చెబుతూ ప్రగల్బాలు పలికే వాళ్లకు కాదు… ప్రజల కోసం పనిచేసే వాళ్లకు పట్టం కట్టాలని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఎన్నికలు రాగానే జెండాలు మార్చుకోవడం సాధారణంగా మారిపోయిందని, గల్లీలో నిస్వార్థంగా కార్యకర్తలు పని చేస్తుంటే కొందరు నాయకులు మాత్రం స్వార్ధం కోసం, డబ్బు సంచుల కోసం పార్టీలు మారుస్తూ రాజకీయ జీవితం ఇచ్చిన పార్టీకి తీరని ద్రోహం చేస్తున్నారని అన్నారు. శనివారం రాయపోల్‌ మండలం మంతూర్‌, అనాజిపూర్‌, చౌదరి పాలెం, చిన్న మాసా న్‌పల్లి, చిన్న అరేపల్లి, లింగారెడ్డి పల్లి, కొత్తపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పార్టీ మారగానే ఈ నాయకుడు గొప్పోడు అంటూ ఆకాశానెత్తుకుంటున్నారు. మొన్నటి దాకా ఆపార్టీ ఎమ్మెల్యే ఎం చేసిండు అంటూ మాట్లాడినవారు ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తుండటం చూస్తుంటే చూసే వారు ఎన్ని డబ్బులు ముట్టాయో ఇలా మాట్లాడుతున్నారు అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.ఎంతో నమ్మకంతో పార్టీ టిక్కెట్లు ఇవ్వగా కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే తీరా ప్రస్తుతం మోసం చేస్తున్నారు. గత ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీ ఏమి కోల్పోయిందో మనం గమనించాలి. రాజకీయ జీవితం ఇచ్చిన మన బీఆర్‌ఎస్‌ పార్టీకి కష్ట కాలంలో పార్టీ నుంచి వెళ్లిపోయే నాయకులకు బుద్ధి చెప్పేవిధంగా కార్యకర్తలు పనిచేయాల న్నారు. దుబ్బాకలో ఇతర పార్టీల వారు ఎవరు గెలిచినా ఒరిగేదేమి లేదన్నారు. కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గం సీనియర్‌ నాయకులు వెంకట నరసింహారెడ్డి, మామిడి మోహన్‌ రెడ్డి, సోలిపేట సతీష్‌ రెడ్డి, జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి, పిఎసిఎస్‌ చైర్మన్‌ వెంకటరెడ్డి, మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, రైతుబంధు మండల అధ్యక్షులు మున్న, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు వెంకట నరసింహారెడ్డి, కోఆప్షన్‌ సభ్యులు పర్వేజ్‌, యువజన విభాగం నాయకులు రాజిరెడ్డి, ఉపాధ్యక్షులు వెంకట్‌ గౌడ్‌, సత్యం, కార్యదర్శి దయాకర్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ శ్రీనివాస్‌ గుప్త, సర్పంచ్లు వెంకటరామిరెడ్డి, శోభారాణి, అమత భాయి, స్వామి, మాజీ ఎంపిటిసి రాజు గౌడ్‌, పాల రామా గౌడ్‌, తాడెం కష్ణ, లక్ష్మారెడ్డి, బాగిరెడ్డి, మల్లారెడ్డి, ఇస్తారి, రామచంద్రం గౌడ్‌, బాలరాజ్‌ గౌడ్‌, మల్ల గౌడ్‌, దయాకర్‌ రెడ్డి, విష్ణు, సతీష్‌, స్వామి తదితరులు పాల్గొన్నారు.