ఏఐతో బీపీఓ ఉద్యోగాలకు ముప్పు

ఏఐతో బీపీఓ ఉద్యోగాలకు ముప్పు– టీసీఎస్‌ సీఈఓ హెచ్చరిక
న్యూఢిల్లీ : కృత్రిమ మేథ (ఏఐ) వల్ల కాల్‌ సెంటర్‌ పరిశ్రమలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) సీఈఓ కృతివాసన్‌ అన్నారు. ఎఐతో సంప్రదాయ బీపీఓ సెంటర్ల అవసరం భారీగా తగ్గనుందన్నారు. నూతన టెక్నాలజీతో ఆసియా సహా పలు చోట్ల కస్టమర్‌ సర్వీస్‌ కార్యకలాపాల్లో పెను మార్పులకు దారి తీయనుందన్నారు. భవిష్యత్‌లో కాల్‌ సెంటర్స్‌ కనిపించకపోవచ్చన్నారు.