ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణానికి ముప్పు

Threat to environment with use of plastic– ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్ 
నవతెలంగాణ – నెల్లికుదురు 
ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణానికి ముప్పు అని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మర్సకట్ల అనిల్ కుమార్ లు అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మర్సకట్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా కళాశాల ఆవరణలో గురువారం ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. ఈ సందర్భంగా కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్ మాట్లాడుతూ సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువుల స్థానంలో స్టీల్‌, పింగాణి వస్తువుల వాడకాన్ని అలవాటు చేసుకోవాలని చెప్పారు. ప్లాస్టిక్‌ నిషేధాన్ని  కళాశాల స్థాయిలో స్వచ్ఛందంగా పాటించడం ద్వారా ఆదర్శంగా నిలవాలని వాలంటీర్లకు సూచించారు. ప్రస్తుతం వినియోగిస్తున్న ప్లాస్టిక్‌లో కేవలం 9% మాత్రమే రీసైక్లింగ్‌ అవుతున్నదని, మిగిలిన ప్లాస్టిక్‌ వ్యర్థాలు నాలాలు, చెరువులు, నదీజలాల్లో కలుస్తూ జీవనానికి పెను ముప్పుగా పరిణమిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధంపై ప్రజలను చైతన్య పరచడంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కృషి చేయాలని అన్నారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతిఒకరూ సామాజిక బాధ్యతతో వ్యక్తిగతంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు . ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించకుంటే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బంటు కవిరాజు, ముక్కెర ప్రకాష్ బాబు, రఘురాం, పెద్దూరి వెంకటేశ్వర్లు, కక్కెర్ల రామ్మూర్తి, భూక్యా నాగేశ్వరరావు, దూపటి శ్రీనివాస్, ఎనమాల సుధాకర్, కందికొండ బాబు, కూన సతీష్, దేశెట్టి యాకన్న, అధ్యాపకేతర బృందం ప్రదీప్, లక్ష్మణ్, గౌరీ శంకర్, ఎన్.స్.స్ వాలంటీర్లు మాధవి, హసీనా, నందీశ్వర్, నవీన్, అరుణ్, యశ్వంత్, శ్రీను రమేష్, రవీందర్ తదితరులు పాల్గోన్నారు.