గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు అరెస్టు..

Three arrested for selling ganjaనవతెలంగాణ – గీసుగొండ
వాహనాల తనిఖీలలో భాగంగా ముగ్గురు గంజాయి విక్రయధారులను పోలీసులు అరెస్టు చేశారు. సీఐ మహేందర్ కథనం ప్రకారం.. గొర్రె కుంట క్రాస్ వద్ద ఎస్సై కుమార్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని వెంటనే పట్టుకొని తనిఖీ చేయగా వారి వద్ద 1.9 కిలోల గంజాయి లభ్యమయింది. వాటి విలువ రూ .47,500  వుంటుందని తెలిపారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించామని పోలీసులు తెలిపారు.