ప్రభుత్వ సలహాదారులుగా ముగ్గురు

Three as government advisers–  ఢిల్లీ ప్రభుత్వ ప్రతినిధిగా మల్లు రవి
– రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సలహాదారు లను నియమించింది. సీఎం సలహాదారుగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులుగా మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, కాంగ్రెస్‌ నేత హర్కర వేణుగోపాల్‌ను నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే మల్లు రవిని నియమించింది. ఆ నలుగురికీ క్యాబినెట్‌ హోదా కల్పిస్తున్నట్టు పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వ్యవహారాల సలహాదారుగా షబ్బీర్‌అలీ, ప్రొటోకాల్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌ సలహాదారుగా వేణుగోపాల్‌కు బాధ్యతలు అప్పగించింది.