నాటుసారా నిర్మూలనలో భాగంగా మండల వ్యాప్తంగా శుక్రవారం తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని చిన్నగారకుంట, యల్లప్పకుంట, జల్మాలకుంట తండాలకు చెందిన భూక్యా పద్మ, గుగులోతు పాపమ్మ, భూక్య లక్ష్మి అను ముగ్గురు మహిళలు నాటుసారా తయారు చేయొచూ పట్టుబడగా మండల డిప్యూటీ తహసిల్దార్ ధరవత్ లాలునాయక్ ఎదుట శుక్రవారం హాజరుపరచారు. ఈ సందర్భంగా ఆయన వారికి బైండోవర్ విధించారు. బైండోవర్ ఉల్లంఘించిన యెడల ఒక లక్ష రూపాయలు జరిమానా లేదా మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధించడం జరిగుతుందని ఆయన తెలిపారు.