మూడు ఫార్మాట్లకు ముగ్గురు సారథులు

మూడు ఫార్మాట్లకు ముగ్గురు సారథులు– దక్షిణాఫ్రికా పర్యటనకు జట్లను ప్రకటించిన బిసిసిఐ
ముంబయి: ఆస్ట్రేలియా టి20 సిరీస్‌ ముగిసిన వెంటనే భారతజట్టు 10నుంచి దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరి వెళ్లనుంది. ఆ పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికాతో టి20, వన్డే, టెస్టుల్లో భారత్‌ తలపడనుంది. ఈ క్రమంలో మూడు ఫార్మాట్‌లకు ముగ్గురు కెప్టెన్లను ప్రకటించిన బిసిసిఐ అందరికీ ఒక్కసారిగా షాక్‌ ఇచ్చింది. రోహిత్‌ శర్మకు వన్డే, టి20లకు విశ్రాంతి తీసుకొని, టెస్టుల్లో సారథ్యం వహించనున్నాడు. అలాగే విరాట్‌ కోహ్లీకి బిసిసిఐ విశ్రాంతి ఇచ్చింది. టెస్టు సిరీస్‌కు రోహిత్‌.. వన్డే సిరీస్‌కు కేఎల్‌ రాహుల్‌.. టి20లకు సూర్యకుమార్‌ యాదవ్‌ నాయకత్వ బాధ్యతలను అప్పగించింది. ఓ విదేశీ టూర్‌కు మూడు ఫార్మాట్లకు ముగ్గురిని కెప్టెన్లుగా బిసిసిఐ నియమించడం ఇదే తొలిసారి.
టి20 జట్టు
సూర్యకుమార్‌(కెప్టెన్‌), జైస్వాల్‌, శుభ్‌మన్‌, గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్‌), తిలక్‌ వర్మ, రింకు సింగ్‌, శ్రేయస్‌, జితేశ్‌ శర్మ(వికెట్‌ కీపర్‌), జడేజా (వైస్‌ కెప్టెన్‌), సుందర్‌, బిష్ణోరు, ఆర్ష్‌దీప్‌, సిరాజ్‌, ముకేశ్‌, దీపక్‌ చాహర్‌, కుల్దీప్‌.
వన్డే జట్టు
కెఎల్‌ రాహల్‌ (కెప్టెన్‌/వికెట్‌ కీపర్‌), గైక్వాడ్‌, సాయి సుదర్శన్‌, తిలక్‌ వర్మ, పటీదార్‌, రింకు సింగ్‌, శ్రేయస్‌, సంజూ శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), అక్షర్‌ పటేల్‌, సుందర్‌, కుల్దీప్‌, చాహల్‌, ముకేశ్‌ కుమార్‌, అవేశ్‌ ఖాన్‌, అర్ష్‌దీప్‌, చాహర్‌.
టెస్టు జట్టు
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్‌, జైస్వాల్‌,కోహ్లీ, శ్రేయస్‌, గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌, కెఎల్‌ రాహుల్‌(వికెట్‌ కీపర్లు), అశ్విన్‌, జడేజా, శార్దూల్‌, సిరాజ్‌, షమీ, బుమ్రా(వైస్‌ కెప్టెన్‌), ప్రసిధ్‌ కృష్ణ
దక్షిణాఫ్రికాతో సిరీస్‌…
డిసెంబర్‌ 10 : తొలి టి20
డిసెంబర్‌ 12 : రెండో టి20
డిసెంబర్‌ 14 : మూడో టి20
డిసెంబర్‌ 17 : తొలి వన్డే
డిసెంబర్‌ 19 : రెండో వన్డే
డిసెంబర్‌ 21 : మూడో వన్డే
డిసెంబర్‌ 26-30 : తొలి టెస్టు
జనవరి 3-7 : రెండో టెస్టు