బైపాస్ రోడ్డుకు మూడు సర్కిల్స్ ఏర్పాటు చేయాలి

నవతెలంగాణ యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట నుండి తుర్కపల్లి రోడ్డు మల్లపురంనకు వచ్చే బైపాస్ రోడ్డుకు రోడ్డు ప్రమాదాలు జరగకుండా మూడు సర్కిల్స్ ఏర్పాటు చేయాలని శుక్రవారం, ఎంపిటిసి కర్రే విజయ వీరయ్య మండల ప్రజా పరిషత్ యాదగిరిగుట్ట సమావేశంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు వినతి పత్రం అందజేశారు. గౌరయపెల్లి నుండి దాతరపల్లి వరకు డాంబర్ రోడ్డు వేయాలని, మల్లాపురం గ్రామంలో మంజూరైన మెడికల్ కాలేజీ ని మల్లాపురం లోనే నిర్మించాలని, అంగన్వాడి భవనమునకు స్లాబ్ వేశారు, నిధులు లేకపోవడం వలన పని సగం మధ్యలోనే ఆగిపోయింది, అతి నిర్మాణం పూర్తి చేయుటకు ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని కోరారు. మల్లాపురం సర్వేనెంబర్ 233లో రేణుక వెంచర్ యాజమాన్యం నీటి ప్రవాహము కాలువను పూడ్చి వెంచర్ చేశారు. పుడ్చిన కాలువను పునరుద్ధరించాలని కోరారు.