మంగళవారం రాత్రి కురిసిన వర్ష బీభత్సానికి పిడుగుపడి మూడు పాడి ఆవులు మృతి చెందిన సంఘటన ఉప్పునుంతల మండలంలో చోటుచేసుకుంది. అధికారులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని తాడూరు గ్రామానికి చెందిన రైతు భూరం విష్ణు కు చెందిన మూడు పాడి జెర్సీ ఆవులు రోజులానే పొలంలో కట్టేసి వచ్చాడు. బుధవారం ఉదయం పలు పితకడానికి వెళ్లి చూడగా మూడు ఆవులు విఘాత జీవులు అయి పడివుండటం చూసి రైతు కన్నీరుమున్నీరుగా విలపించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో ఆ సంఘటన చూడటానికి గ్రామస్థులు బారులు తిరినట్లు తెలిపారు.ఒకే రైతుకు చెందిన మూడు పాడి ఆవులు నిపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు.అధికారులకు సమాచారం ఇవ్వడంతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుజాత,వెటర్నరీ డాక్టర్ కమల పరిశీలించి పంచనామా నిర్వహించి వాటి విలువ సుమారు 2.50 లక్షలు ఉంటుందని తెలిపారు.ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి రైతును ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కట్ట అనంత రెడ్డి, కార్యకర్తలు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి స్థానిక ఎమ్మెల్యే కు సమాచారం అందించినట్లు తెలిపారు.