
మండలంలోని మధ్యాహ్న భోజన కార్మికులు మూడు రోజులు మూడు రోజులు మధ్యాహ్న బోజన పథకాన్ని బందు చేస్తున్నట్లు మండల ఏంఇఓ రాజ్ గంగారెడ్డి కి వినతి పత్రం గురువారం అందజేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికులకు 2022 మార్చి బడ్జెట్ సమావేశాల సందర్భంగా వేతనాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించినప్పటి నుండి ఎరియర్స్ తో సహా జీఓ నెం. 8 ప్రకారం చెల్లించాలని, కొత్తమెనూ సవరించాలని, పెండింగ్ బిల్లులు తక్షణం విడుదల చేయాలని, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ అక్షయ పాత్రకు అప్పజెప్పడాన్ని విరమించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 2023 జూలై 10, 11, 12 తేదీల్లో మూడు రోజులు మధ్యాహ్న భోజన కార్మికులు వంట బంద్ పెట్టి టోకెన్ సమ్మె చేస్తున్నామని తెలియజేస్తునట్లు తెలిపారు. డిమాండ్స్.. జీఓ నెం. 8 ప్రకారం వేతనాలను ఎరియర్స్ తో సహా చెల్లించాలి. పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి. కొత్త మెనూను సవరించాలి. మధ్యాహ్న భోజన నిర్వహణను అక్షయ పాత్ర లాంటి సంబంద సంస్థలకు ఇవ్వరాదు. గుడ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలి. అవసరమైన సబ్సిడీకి ఇవ్వాలి. గుర్తింపు కార్డులు ప్రభుత్వమే ఇవ్వాలి. అక్రమ తొలగింపులు అరికట్టాలి. రాజకీయ వేధింపులు ఆపాలి. వంట షెడ్లు, వంట పాత్రలు తదితర మౌలిక వసతులు కల్పించాలి. కాటన్ బట్టల యూనిఫామ్ ఇవ్వాలి. సామాజిక భద్రత కల్పించాలి. ప్రమాద బీమా, పెఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. ఎలాంటి షరతులు లేకుండా బ్యాంక్ ద్వారా రుణాలు ఇవ్వాలనీ కోరారు. I కార్యక్రమంలో మధ్యాహ్న బోజన కార్మికుల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ గంగాధర్, మండల అధ్యక్షులు మర్వడి బలారజ్ పాల్గొన్నారు.