కుక్కల దాడిలో మూడు మేకలు మృతి..

నవతెలంగాణ – నవీపేట్
మండలంలోని ఫకీరాబాద్ గ్రామంలో శనివారం రాత్రి రాథోడ్ మోహన్ కు చెందిన మూడు మేకలపై దాడి చేయగా మృతి చెందాయి. మూడు మేకల విలువ సుమారు రూ.40000 ఉంటుందని,  గ్రామంలో కుక్కల బెడదను నివారించి జీవాలతో పాటు మనుషుల ప్రాణాలను రక్షించాలని కోరుతున్నారు.