అట్లాంటాలో కాల్పులు – ముగ్గురు మృతి

న్యూయార్క్‌ : అమెరికాలోని అట్లాంటాలో శనివారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. మరొకరు గాయపడ్డారు. పీచ్‌ట్రీ రోడ్‌ ఎన్‌ఇలో స్థానిక కాలమానం ప్రకారం.. శనివారం సాయంత్రం 6.25 గంటల ప్రాంతంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నట్లు ఆట్లాంటా పోలీసు విభాగం అధికారులు తెలిపారు. ఘటనాస్థలంలోనే ముగ్గురు చనిపోయారని, మరొకరు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.