అతను పుట్టాకనే
మాట పరిమళించింది
పాట పరవశించింది
కవిత కొత్త కాంతులీనింది!
అతని నోట
తెలుగూ ఉర్దూ భాషలు
గంగా జమునల సంగమమై
యావదాంధ్ర పరివ్యాప్తమైనవి!
అతను పాఠమై
తరగతి గదిలో ప్రవహిస్తుంటే
విద్యార్థులంతా వినాయకులే
అతను అపర వ్యాస మహర్షే!
అతని కీర్తి కిరీటం
హనుమాజీ పేట శిరసుపై
జ్జాన పీఠ మకుటమై
దేశమంతా వెలుగులు విరజిమ్మింది!
అతనిప్పుడు ఎదుట లేకున్నా
ఎదలో పదిలంగా చలన గీతమై
ద్రోహ బుద్ధి లేని ద్రోణాచార్యుడిలా
నిత్యం వెలుగిస్తూనే ఉన్నాడు!
అతిశయోక్తి కాదు అతనెప్పటికీ
తెలుగు కవిత నుదిటి మీద
చెరగని ఎన్నటికీ వన్నె తరగని
మూడక్షరాల వైభవం ‘ సినారె’ !!
– కోట్ల వెంకటేశ్వర రెడ్డి
9440233261.