నవతెలంగాణ-ఆదిలాబాద్‌రూరల్
మీ ఇంటి మేలు జరుగుతాదని చెప్పు, మంచి జరుగుతాదని చెప్పు అంటూ గంగిరెద్దుల తలను ఊపిస్తూ ప్రజలను ఆనందింపజేస్తారు గంగిరెద్దుల వారు. దేశంలో ఆ మూల నుంచి ఈ మూల వరకు మకాం వేస్తూ, యాచిస్తూ సంచార జీవులుగా బతుకుతుంటారు. ప్రతి సంవత్సరం వీరు సంక్రాంతి ముందు వచ్చి యాచిస్తారు. కాని ఈ సంవత్సరం మాత్రం మూడు నెలల ముందుగానే వచ్చి యాచిస్తున్న చిత్రం సోమవారం మావల మండలంలోని దుబ్బాగూడ ఇంటింటికి తిరుగుతూ గంగిరెద్దుల తలను ఆడిస్తూ, తమ యాచక వృత్తిని కొనసాగిస్తున్నారు.