– గంభీరావుపేట పోలీస్ స్టేషన్ లో గతంలో కేసు నమోదు.
నవతెలంగాణ – సిరిసిల్ల
నాటు తుపాకులు తయారు చేస్తున్న వ్యక్తితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ అఖిల్ మహజన్ పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఆయన వారిని అరెస్టు చూపిన అనంతరం మాట్లాడుతూ.. గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామానికి చెందిన రాయలింగు శంకర్ అనే వ్యక్తి నాటు తుపాకులు తయారు చేసి వాటిని అదే గ్రామానికి చెందిన అడవి జంతువులను వేటాడే వారికి అమ్ముతున్నాడన్నా నమ్మదగిన సమాచారం రాగా గంభీరావుపేట ఎస్.ఐ తన సిబ్బందిని తీసుకొని గజసింగవరం గ్రామంలోని రాయలింగు శంకర్ ఇంటికి వెళ్ళగా అక్కడ రాయలింగు శంకర్ వివిధ పనిముట్ల ఉపయోగించి నాటు తుపాకులు తయారు చేస్తుండగా పట్టుకొని, అతని వద్ద రెండు తుపాకి బ్యారెల్, తుపాకుల తయారు చేయడానికి వాడే రంపము, సుత్తి, కత్తి, ఆకు రాయి, డ్రిల్లింగ్ మిషన్ ,దూడ మిషన్, ఎయిర్ బుల్లోజర్ స్వాధీనం చేసుకొని నిందుతున్నీ పై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్పీ పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కేసు తదుపరి దర్యాప్తు ప్రారంభించగా దర్యాప్తులో భాగంగా గజసింగవరం గ్రామానికి చెందిన రాయలింగు శంకర్ వద్ద నాటు తుపాకులు కొనుగోలు చేసి జంతువుల వేటకు ఉపయోగిస్తున్న రాయలింగు చంద్రమౌళి, శాతవేణిహరీష్ లోగిడి గంగయ్య లను అదుపులోకి తీసుకొని వారి వద్ద రెండు తుపాకులు నాలుగు ట్రిగర్ భాగాలు స్వాధీనం చేసుకొవడం జరిగిందని నలుగురు నిందుతులను రిమాండ్ కి తరలించడం జరిగిందని తెలిపారు.చాకచక్యంగా వ్యవహరించి నింధుతులను అరెస్ట్ చేసిన ఎల్లారెడ్డిపేట్ సి.ఐ శ్రీనివాస్,గంభీరావుపేట ఎస్.ఐ రామ్మోహన్,సిబ్బంది ని జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ శ్రీనివాస్, ఎస్ .ఐ లు రామ్మోహన్,రమాకాంత్ సిబ్బంది పాల్గొన్నారు.