నవతెలంగాణ – తాడ్వాయి
మండలంలో కమలాపూర్ నుండి కాటాపూర్ 33 కె.వి లైన్ మరమ్మతుల కారణంగా రేపు బుధవారం కాటాపూర్ సబ్ స్టేషన్ పరిధిలో నీ గ్రామాలలో, ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు విద్యుత్ త్రీ ఫేజ్ కరెంట్ సరఫరా అంతరాయం ఏర్పడుతుందని(నిలిపివేస్తున్నట్లు) ములుగు జిల్లా ఎన్పీడీసీఎల్ డిఇ పులుసం నాగేశ్వరరావు ఒక ప్రకటనలో కోరారు. ఇండ్లలో కరెంటు ఉంటుందన్నారు. వ్యవసాయదారులకు త్రీఫేజ్ కరెంట్ మాత్రమే అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాల్సిందిగా కోరారు.