నవతెలంగాణ – నెల్లికుదురు
అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న మూడు సీజ్ చేసినట్లు తొర్రూర్ సీఐ సంజీవ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ తొరూర్ సర్కిల్ పరిధిలో నీ ఆఖరి వాగు లోని ఇసుకను ఆక్రమంగా రవాణా చేస్తున్న క్రమంలో నర్సింలపేట మండలంలోని రెండు ట్రాక్టర్లను సీచేసి అక్కడి పోలీస్ స్టేషన్లో ఉంచామని అన్నారు. మరొకటి నెలకుదురు పోలీస్ స్టేషన్లో ఉంచామని తెలిపారు వాటిని మైనింగ్ అధికారులకు అప్పగిస్తున్నామని తెలిపారు. ఎవరైనా ఆఖరి వాగు ఏరియాలో ఇసుకను ఆక్రమంగా దొంగ రవాణా చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. అంతే కాకుండా దొంగతనాలకు పాల్పడిన వ్యక్తులను సహించేది లేదని హెచ్చరించినట్టు తెలిపారు. నిబంధనలను అతిక్రమిస్తే ఎంతటి వారినైనా వారిపై చట్టమైన చెల్లెలు తీసుకుంటామని అన్నారు వీరి వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు.