తన పుట్టినరోజు సందర్భంగా హీరో శర్వానంద్ తన సినిమాల అప్‌డేట్స్ ఇచ్చి అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. ఇందులో భాగంగా ఆయన నటిస్తున్న 35వ చిత్రం ‘మనమే’ విడుదలకు సిద్ధమైంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత కాగా, కతి ప్రసాద్, ఫణి వర్మ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. శర్వా బర్త్‌డే కానుకగా టైటిల్, ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. దీని తర్వాత తన 36వ సినిమాని సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘లూజర్’ ఫేమ్ దర్శకుడు అభిలాష్ కంకరతో చేయబోతున్నారు. విక్రమ్ సమర్పణలో వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్ర పోస్టర్ సూచించినట్లుగా, ఇది స్పోర్ట్స్ బేస్డ్ మూవీగా ఉండబోతోంది, ఇందులో హీరో బైక్ రైడర్‌గా కనిపిస్తారు. ఇది మూడు తరాల కుటుంబానికి సంబంధించిన అద్భుతమైన కథ. 90, 20వ దశకం ప్రారంభంలో మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంతో పాటు లవ్, డ్రీమ్స్ ప్రధానాంశాలుగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. తన గత సినిమా ‘సామజవరగమన’తో సెన్సేషనల్ హిట్ అందించిన డైరెక్టర్ రామ్ అబ్బరాజు శర్వానంద్ 37వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్ ప్రకారం ఇది జారు ఫుల్ హిలేరియస్ రైడ్‌గా ఉండబోతుంది.