
ఓ మైనర్ బాలికకు శారీరకంగా వేధింపులకు గురి చేసినందుకు ఒక వ్యక్తికి మూడేళ్ళపాటు భూపాలపల్లి కోర్టు జైలు శిక్ష విధించిన్నట్లుగా కొయ్యుర్ ఎస్ఐ నరేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ఐ పూర్తి కథనం ప్రకారం మండలంలోని వళ్లెంకుంట గ్రామపరిదిలోని శాలపల్లికి చెందినటువంటి వేల్పుల శ్రీకాంత్ అనే వ్యక్తి మైనర్ బాలికపై అత్యాచారాయత్నానికి పాల్పడిన నేపథ్యంలో భూపాల్ పల్లి జిల్లా జడ్జి నారాయణ బాబు మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధించడం జరిగిందన్నారు. ఈ కేసులో ట్రయల్ సక్రమంగా నడిపించి శిక్ష పడే విధంగా చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ అధికారికి బి.స్వామి ఇందులో భాగస్వాములైన స్పెషియల్ పిపి విష్ణు వర్ధన్ రావు,కాటారం సిఐ నాగార్జున రావు,కొయ్యుర్ ఎస్ఐ నరేశ్, కోర్టు పిసి రమేష్, డబ్ల్యూ పిసి వరలక్ష్మి లను భూపాల్ పల్లి ఎస్పీ కిరణ్ కారే, కాటారం డిఎస్పి రామ్మోహన్ రెడ్డి లు ప్రత్యేకంగా అభినందించారు.