థ్రిల్‌ చేసే ‘కిల్లర్‌’

A thrilling 'killer'”శుక్ర’, ‘మాటరాని మౌనమిది’, ‘ఏ మాస్టర్‌ పీస్‌’ వంటి డిఫరెంట్‌ సినిమాలతో సినీ ప్రేమికుల దష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్‌. ఆయన తాజాగా ‘కిల్లర్‌’ (పార్ట్‌ 1 డ్రీమ్‌  గర్ల్‌ ) అనే యాక్షన్‌ థ్రిల్లర్‌ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన ఒక హీరోగా నటిస్తుండటం విశేషం. ఏయు అండ్‌ఐ, మెర్జ్‌ ఎక్స్‌ ఆర్‌ సంస్థతో కలిసి థింక్‌ సినిమా  బ్యానర్‌ పై ఈ చిత్రాన్ని పూర్వాజ్‌ ప్రజరు కామత్‌, ఎ.పద్మనాభరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ కలయికలో నిర్మాణమవుతున్న రెండవ చిత్ర మిది. ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ను హైదరాబాద్‌,  వికారాబాద్‌ పరిసర ప్రాంతాల్లో పూర్తి చేశారు. 10 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్‌లో హీరో పూర్వాజ్‌, హీరోయిన్‌ జ్యోతి పూర్వాజ్‌తో పాటు ప్రధాన తారాగణం పాల్గొన్నారు.  ప్రస్తుతం రెండో షెడ్యూల్‌ చిత్రీకరణ ప్రారంభిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో మరో హీరో విశాల్‌ రాజ్‌ పాల్గొంటారు. రామోజీ ఫిలిం సిటీ, మొయినాబాద్‌ లొకేషన్స్‌లో జరిగే ఈ రెండో  షెడ్యూల్‌లో గౌతమ్‌ అనే యాక్టర్‌తో పాటు జ్యోతి పూర్వజ్‌ కూడా జాయిన్‌ కాబోతున్నారు. ఈ షెడ్యూల్‌లో కూడా సినిమాకి సంబంధించి కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.  భిన్న యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది. పవర్‌ఫుల్‌ కాన్సెప్ట్‌తో దర్శకుడు పూర్వాజ్‌ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు అని  చిత్ర యూనిట్‌ తెలిపింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – జగదీశ్‌ బొమ్మిశెటి, మ్యూజిక్‌ – అషీర్‌ ల్యూక్‌, సుమన్‌ జీవరతన్‌, నిర్మాతలు – పూర్వాజ్‌, ప్రజరు కామత్‌, ఎ. పద్మనాభ  రెడ్డి, రచన, దర్శకత్వం – పూర్వాజ్‌.