రూఖ్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘జవాన్’. హాలీవుడ్‌లో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, కెప్టెన్ అమెరికా’ వంటి టాప్ మోస్ట్ యాక్షన్ మూవీస్‌కి యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేసిన ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ స్పిరో రజటోస్.. ఈ సినిమాకు యాక్షన్ సీక్వెన్స్‌లను కంపోజ్ చేశారు.
ఈ సినిమాకు కళ్లు చెదిరే, వావ్ అని ఆశ్చర్యపోయేలా యాక్షన్ సన్నివేశాలను ఆయన డైరెక్ట్ చేశారు. మల్టీ టాలెంటెడ్ స్టంట్ మ్యాన్, స్టంట్ కో ఆర్టినేటర్, డైరెక్టర్‌గా పేరున్న స్పిరో రజటోస్ హాలీవుడ్‌లో తనదైన ముద్ర వేశారు.
ఆయన యాక్షన్ సన్నివేశాలకు బెస్ట్ స్టంట్ కో ఆర్టినేటర్‌గా టారస్ అవార్డుతో పాటు 2004లో విడుదలైన బ్యాడ్ బార్సు2కి మూడు అవార్డులను సొంతం చేసుకున్నారు. ‘జవాన్’ కోసం రూపొందించిన యాక్షన్ సన్నివేశాలను షారూఖ్ స్క్రీన్‌పై అద్భుతంగా ప్రదర్శిన్నప్పుడు ప్రేక్షకులు తెలియని ఉద్వేగానికి లోనవుతారు. వీరిద్దకి కలయికలో రానున్న ‘జవాన్’ యాక్షన్ సీన్స్ ప్రేక్షకుల హదయాల్లో చెరగని ముద్రను వేస్తాయి. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ సమర్పణలో, అట్లీ దర్శకత్వంలో గౌరీ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గౌవర్ వర్మ ఈ సినిమాకు సహ నిర్మాత. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 7న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. భారీ అంచనాలతో రాబోతున్న ఈ సినిమా సంచలనం సృష్టించడం ఖాయమనే దీమాతో మేకర్స్ ఉన్నారు.