థ్రిల్‌ చేసే కోడి బుర్ర

థ్రిల్‌ చేసే కోడి బుర్రశ్రీరామ్‌ హీరోగా, శతి మీనన్‌, ఆరుషి హీరోయిన్స్‌గా నటించనున్న కొత్త చిత్రం ‘కోడి బుర్ర’. ఈ సినిమా సోమవారం ఫిలింనగర్‌ దైవ సన్నిధానంలో లాంఛనంగా ప్రారంభమైంది.
ఈ చిత్రాన్ని వీ4 క్రియేషన్స్‌ బ్యానర్‌పై కంచర్ల సత్యనారా యణరెడ్డి, గట్టు విజరు గౌడ్‌, చిన్ని చందు, వట్టం రాఘవేంద్ర, సముద్రాల మహేశ్‌ గౌడ్‌ నిర్మిస్తున్నారు. చంద్రశేఖర్‌ కానూరి దర్శకత్వం వహిస్తున్నారు. మహావీర్‌ కీ రోల్‌ పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో అతిథిలుగా పాల్గొన్న ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డి కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ క్లాప్‌ నివ్వగా, దర్శకుడు భరత్‌ కమ్మ స్క్రిప్ట్‌ అందజేశారు. దర్శకుడు చంద్రశేఖర్‌ కానూరి మాట్లాడుతూ, ‘ఈ చిత్రంలో పోలీస్‌ ఆఫీసర్‌గా శ్రీరామ్‌ కనిపిస్తారు. అందరికీ నచ్చేలా మంచి క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమా అవుతుందని నమ్ముతున్నాం’ అని తెలిపారు. ‘ఈ సినిమా క్రైమ్‌ థ్రిల్లర్‌ కథతో మీ ముందుకు రాబోతోంది. ఒక ఇంట్రెస్టింగ్‌ మూవీలో పార్ట్‌ కావడం హ్యాపీగా ఉంది’ అని హీరో శ్రీరామ్‌ చెప్పారు. ‘ఈ నెల 22వ తేదీ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్తున్నాం. మంచి కథ, మా డైరెక్టర్‌ ఎంతో క్రియేటివ్‌గా స్క్రిప్ట్‌ చేశారు. ఈ సినిమా హిట్‌ ఖాయం అనే నమ్మకంతో ఉన్నాం’ అని నిర్మాతలు అన్నారు.