థ్రిల్‌ చేసే సినిమా

Thrilling movieసహస్ర ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ పై నిశాంత్‌, ఎంఎన్‌ఓపీ సమర్పణలో దర్శకుడు బసిరెడ్డి రానా దర్శకత్వంలో నిర్మాత నరేంద్ర బుచ్చిరెడ్డిగారి నిర్మిస్తున్న చిత్రం ‘హైడ్‌ అండ్‌ సిక్‌’. ఈ చిత్ర ట్రైలర్‌ లాంచ్‌ వేడుక తిరుపతి ఎస్‌ఐటీ కాలేజీలో ఘనంగా జరిగింది. కాలేజీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చిత్రం చిత్ర బృందంతోపాటు కాలేజీ యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత నరేంద్ర బుచ్చిరెడ్డిగారి మాట్లాడుతూ,’ ఇంత మంచి అవకాశం ఇచ్చిన కాలేజీ యాజమాన్యానికి ధన్యవాదాలు. ఈ చిత్రం అందరిని అలరించే ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ అవుతుంది. అందరూ కచ్చితంగా ఈనెల 13న థియేటర్లలో చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాం’ అని అన్నారు.
‘ియేటర్‌లో చూసే ప్రేక్షకులను ఆద్యంతం కట్టి పడేసే అద్భుతమైన కథతో ఈ చిత్రం రూపొందింది. సీట్‌ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే ఎన్నో సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయి’ అని డైరెక్టర్‌ బసి రెడ్డి రానా తెలిపారు. హీరో విశ్వంత్‌ మాట్లాడుతూ,’ఈ చిత్రం పట్ల చాలా పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడం మాకు మరింత నమ్మకాన్ని పెంచింది’ అని అన్నారు.